బిగ్ బాస్ సీజన్- 8 విన్నర్ గా నిఖిల్, రన్నరప్ గా గౌతమ్ నిలిచారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. ఎలిమినేషన్ వరకు వెళ్లి మణికంఠ వళ్ళ సేవ్ అయి, తన అటతీరుని చేంజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కసిగా ఆడుతూ ఇండివిడ్యువల్ ప్లేయర్ గా ఆడి బిగ్ బాస్ ఫినాలే లో స్టేజిపై ఉన్నాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి నుండి సోలో బాయ్ అంటూ ఒక ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. యష్మీతో లవ్ ట్రాక్ నడిపించినా కూడా అది సెట్ అవ్వలేదు.
తాజాగా గౌతమ్ కి సంబంధించిన బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు గౌతమ్. ఈ సీజన్ లో అశ్వథ్దామా 3.0గా అడుగు పెట్టావని యాంకర్ అర్జున్ అన్నాడు. గత సీజన్ థర్టీన్త్ వీక్ వెళ్ళిపోయానని రెగ్రేట్ ఉండే, ఆ సీజన్ కి ఈ సీజన్ కి తేడా ఏంటి అని యాంకర్ అడుగగా.. నిజాయితీ, నిర్మొహమాటంగా లెట్స్ టేక్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ అని గౌతమ్ చెప్పాడు. సీజన్ మొత్తం లో ఏమైనా రీగ్రెట్ ఉందా అని యాంకర్ అడగ్గా.. సిక్స్, సెవెన్ వీక్ లో కొంచెం డౌన్ అయ్యానని గౌతమ్ అన్నాడు.
టాప్-2 రావడానికి మణికంఠనే అంటే ఒప్పుకుంటావా అని యాంకర్ అడుగ్గా.. ఇక్కడి దాకా రావడానికి నేను చేసిన ఎఫర్ట్ అని నేను నమ్ముతున్నానని గౌతమ్ చెప్పాడు. లాస్ట్ ఇయర్ శుభశ్రీతో.. ఇప్పుడు యష్మీతో కావాలనే లవ్ ట్రాక్ నడిపించావనిపించింది.. బయట నుండి యష్మీ , నిఖిల్ ది చూసి లోపలికి వెళ్ళాక ఏమనిపించింది. అసలు స్టేజ్ పైన ఉంటే ఏమనిపించింది.. గెలుస్తావనుకున్నావా.. కప్ కి నీకన్నా నిఖిల్ డిజర్వ్ అనుకున్నావా యాంకర్ అడుగగా.. పక్కన వాళ్లు గెలిచినా.. ఓడినా.. నేను హ్యాపీ అని గౌతమ్ పాజిటివ్ గా స్పందించాడు. సీజన్-8 రన్నరప్ గా నిలిచిన గౌతమ్ కి బయట భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే వైల్డ్ కార్డ్ గా రావడంతో మొదటి నుండి ఉండే ఓట్ బ్యాంకింగ్ తక్కువగా పడింది. ఇదే పెద్ద మైనస్.. లేదంటే గౌతమ్ విన్నర్ అయ్యేవాడనడంలో ఎటువంటి సందేహం లేదు.